ఉమా మహేశ్వరరావు అరెస్ట్ .. ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్న అధికారులు

ఉమా మహేశ్వరరావు అరెస్ట్ ..  ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్న అధికారులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమా మహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. పదిరోజుల పాటు కస్టడీ విచారణ కోరనున్నారు అధికారులు. కస్టడీలో మరికొంత మంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడే అవకాశం ఉంది. మరోవైపు అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావుకు.. 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5వరకు రిమాండ్ లో ఉండనున్నారు ఉమా మహేశ్వర్ రావు. ప్రస్తుతం ఉమా మహేశ్వర్ రావు.. చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

సీసీఎస్‌‌‌‌‌‌‌‌లో హైప్రొఫైల్ కేసులనే ఉమామహేశ్వర్ రావు టీమ్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా కేసుల్లో సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకే ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొంత మంది పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. 

అవినీతితో కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి కొంత మంది పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ సమయంలో ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంబంధిత అధికారులను విచారించే అవకాశాలు ఉన్నాయి.