రగ్డ్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్న నాగ చైతన్య

రగ్డ్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్న నాగ చైతన్య

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తండేల్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌‌‌లో  శరవేగంగా జరుగుతోంది. బుధవారం ఈ మూవీ సెట్స్‌‌‌‌ నుంచి లొకేషన్  స్టిల్‌‌‌‌ను రిలీజ్ చేశాడు నాగ చైతన్య. ఇందులో రాజు అనే జాలరి పాత్ర పోషిస్తున్న  చైతూ రగ్డ్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్లు జైల్లో ఉండి భారత్‌‌‌‌కు తిరిగి వచ్చిన రాజు అనే మత్య్సకారుడి నిజ జీవితమే ఈ కథ అని రీసెంట్‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో స్టోరీ రివీల్ చేశాడు నాగ చైతన్య. 

తాను ఈ పాత్ర కోసం తొమ్మిది నెలలు కష్టపడినట్టు చెప్పాడు. ముఖ్యంగా శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకోవడానికి అక్కడి మత్స్యకారులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నా అన్నాడు.  తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో  చేస్తోన్న బిగ్గెస్ట్ మూవీ ఇది అని,  కచ్చితంగా  రాజు పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తున్నాడు.