విశ్వంభర నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌కు రెడీ

విశ్వంభర నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌కు రెడీ

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొం దిస్తున్న సోషీయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది.  ఈ సినిమా కోసం ఏకంగా పదిహేనుకు పైగా సెట్స్‌‌‌‌ వేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఇంటర్వెల్‌‌‌‌ సీన్‌‌‌‌కు సంబంధించి ఓ యాక్షన్‌‌‌‌ సీక్వెన్స్‌‌‌‌ను కూడా కంప్లీట్ చేశారు. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న  చిరంజీవి.. ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్‌‌‌‌కి వెళ్లి రావడం, అలాగే పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లొచ్చారు.  

తాజాగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌లో జాయిన్  అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈరోజు నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌లో వేసిన స్పెషల్‌‌‌‌ సెట్‌‌‌‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.  వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ వర్క్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ నెలాఖరు  నాటికి చిత్రీకరణ పూర్తి కానుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న సినిమా ఇది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.