మే 24న పాలిసెట్ ఎగ్జామ్

మే 24న పాలిసెట్ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్ ఎగ్జామ్ శుక్రవారం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు పరీక్ష జరగనున్నదని అధికారులు తెలిపారు.  నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు.  ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 92,808 అప్లై చేసుకున్నారు.  

వీరిలో ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 56,764 మంది, ఎంబైపీసీ నుంచి 36,044 మంది ఉన్నారు. మొత్తం 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ మీద ఫొటో ప్రింట్ కాని స్టూడెంట్లు.. పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. పాలిసెట్ ద్వారా ఇంజినీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.