సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతా : బోయపాటి శ్రీను

సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతా : బోయపాటి శ్రీను

రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన  చిత్రం ‘స్కంద’. సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కరీంనగర్‌‌‌‌లో ‘స్కంద’ కల్ట్ జాతర పేరుతో రిలీజ్ ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేశారు. రామ్ మాట్లాడుతూ ‘బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. అయితే ఇందులో మాస్‌‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అలాగే సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. 

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. తర్వాత టెన్షన్ ఉండదు. ఎందుకంటే మంచి సినిమా తీశాననే నమ్మకం ఉంది. కచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది సాయి మంజ్రేకర్.  శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, రచ్చరవి, శ్రవణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.