ఇంటెన్స్ లవ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీగా స్కై

ఇంటెన్స్  లవ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీగా స్కై

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో  పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తూ  నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజుతో కలిసి  నిర్మించిన  సినిమా  ‘స్కై’.   ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది. శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన  నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని,  పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుతూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

  మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘హీరోగా నాకిది తొలిచిత్రం. పాటలకు చక్కని ఆదరణ లభించినట్టుగానే సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని  నమ్ముతున్నాం’ అని అన్నాడు.  హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రాధాన్యత గల పాత్ర పోషించడం పట్ల శృతి శెట్టి సంతోషం వ్యక్తం చేసింది.

 దర్శక నిర్మాత  పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ ‘ఈ  సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందే  సాంగ్స్ అన్నీ  రెడీ చేసి పెట్టుకున్నాం.  డీవోపీ రసూల్ గారు ఇచ్చిన సజెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  అనుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ చేయగలిగాం’ అని చెప్పాడు.  నటి కేఎల్ కే మణి బామ్మ,  మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్,  ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గుంటక సహా టీమ్ అంతా పాల్గొన్నారు.