
కొలంబో: మూడు దేశాల వన్డే సిరీస్‌లో ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ జోరుకు బ్రేక్ పడింది. ఏడేండ్ల తర్వాత శ్రీలంక చేతిలో మన అమ్మాయిల జట్టు తొలిసారి ఓడిపోయింది. ఆల్‌రౌండర్ నీలాక్షిక సిల్వ (56) మెరుపు ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లంక 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఫార్మాట్‌లో టీమిండియాపై లంక అమ్మాయిలకు ఇది మూడో విజయం.
ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌సేన నిర్ణీత 50 ఓవర్లలో 275/9 స్కోరు చేసింది. రిచా ఘోష్ (58) ఫిఫ్టీతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెమీమా రోడ్రిగ్స్ (37), ప్రతీకా (35), హర్మన్(30) కూడా రాణించారు. లంక బౌలర్లలో సుగందిక కుమారి, చామరి ఆటపట్టు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో లంక 49.1 ఓవర్లలో 278/7 స్కోరు చేసి గెలిచింది. నీలాక్షికతో పాటు హర్షిత సమరవిక్రమ (53) ఫిఫ్టీతో రాణించింది. ఇండియా బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టింది. నీలాక్షిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. . బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఇండియా.. సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. శుక్రవారం లంక–సౌతాఫ్రికా తలపడతాయి.