Asian Cricket Council: జై షా స్థానంలో ఏసీసీకి కొత్త బాస్.. ఎవరీ షమ్మీ సిల్వా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. డిసెంబరు 1 నుంచి షా అధికారికంగా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ క్రమంలో అమిత్ షా తనయుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. అతని స్థానంలో షమ్మీ సిల్వాను తదుపరి అధ్యక్షుడిగా ప్రకటించారు. 

ఎవరీ షమ్మీ సిల్వా..?

ప్రస్తుత శ్రీలంక క్రికెట్(SLC) ప్రెసిడెంటే.. ఈ షమ్మీ సిల్వా. 1983/84లో కొలంబో క్రికెట్ క్లబ్‌ తరుపున ఆడిన సిల్వా.. కొలంబో జట్టుకు కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, ఈయన శ్రీలంక స్క్వాష్ జాతీయ జట్టు సభ్యుడు, మేనేజర్ మరియు కోచ్. Mr. ACC ఫైనాన్స్ & మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా అనేక సంవత్సరాలు పనిచేసిన సిల్వా ఈ పాత్రకు సరితూగగలరనే నమ్మకాన్ని ఇతర ఆసియా దేశాల బోర్డులు విశ్వసించాయి.

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని షమ్మీ సిల్వా చెప్పుకొచ్చారు. సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. ఏసీసీ ప్రెసిడెంట్‌గా షమ్మీ సిల్వాకు ఎదురవుతున్న ప్రధాన సవాల్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భారత్, పాకిస్థాన్‌లలో జరిగే ఆసియా కప్. ఈ మేరకు తన పాత్రకు న్యాయం చేయగలరో చూడాలి.

ALSO READ : AUS vs IND: నిరాశ పరిచిన టీమిండియా.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఆసీస్