హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి ముసురు.. సాయంత్రానికి పెరిగిన వాన.. ఈ ఏరియాల్లో ఉండేవాళ్లు జాగ్రత్త

హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి ముసురు.. సాయంత్రానికి పెరిగిన వాన.. ఈ ఏరియాల్లో ఉండేవాళ్లు జాగ్రత్త

హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. గత కొద్దిరోజులుగా కాస్త తెరిపిచ్చిన వాన.. మళ్లీ మంగళవారం (ఆగస్టు 25) మొదలైంది. నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అన్నట్లుగానే ఉదయం నుంచి వెదర్ చల్లగా, మబ్బులు కమ్ముకుని కనిపించింది. మధ్యాహ్నం నుంచి ముసురుకు కమ్ముకున్న వాతావరణం సాయంత్రం అయ్యే సరికి ముసురు కాస్త వానగా మారింది. 

హైదరాబాద్ లో పలు ఏరియాల్లో చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సికింద్రాబాద్ తో పాటు మెట్టుగూడ, తార్నాక, నాచారం, ఉప్పల్, బోడుప్పల్, రామాంతపూర్ ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. 

మరోవైపు ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో కూడా వర్షం పడుతోంది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, కేబీఆర్ పార్క్, జూబ్లీచెక్ పోస్ట్, క్రిష్ణానగర్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఇక మిగతా ప్రాంతాల్లో ముసురు పడుతోంది. రానున్న మరికొన్ని గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

వినాయక చవితి ఉత్సవాలు మొదలవ్వడంతో గల్లీగల్లీల్లో మండపాలు వెలిశాయి. అయితే వర్షం కారణంగా వినాయక మండపాల ముందు కాస్త సందడి తగ్గింది. వర్షం కురుస్తున్నప్పటికీ కొందరు భక్తులు ఏర్పాటు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వర్షాలు కురుస్తుండటంతో నిర్వాహకులు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వర్షం కారణంగా కరెంటు షాక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షంలో వైర్లు తేలకుండా చూసుకోవాలని.. ఇనుప వస్తువులకు వైర్లు టచ్ కాకుండా చూసుకోవాలని సూచించారు.