యూట్యూబ్‌లో పాటలు పెట్టుకుని, టీవీలో మంచి పాటలు వచ్చినప్పుడు పిల్లలు డాన్స్ చేస్తుంటారు. అప్పుడు మంచి లైటింగ్ ఉంటే వాళ్లకు ఇంకాస్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ లైట్లను ఆన్ చేస్తే సరిపోతుంది. వీటిని ఎల్‌మేటెక్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటిలో ఇంటెలిజెంట్ సౌండ్ సెన్సర్ ఉంటుంది. అది సౌండ్స్‌ని, మ్యూజిక్‌ని పసిగట్టి అందుకు అనుగుణంగా లైట్ రంగులను మారుస్తుంటుంది.
పార్టీలు, డ్యాన్స్ ఫ్లోర్, కారులో పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. వీటికి పవర్ కనెక్షన్ అవసరం లేదు. బ్యాటరీ కూడా ఉండదు. యూఎస్‌బీ ఇంటర్‌ఫేస్ ఉండే ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అంతెందుకు ఓటీజీ ఎడాప్టర్ సాయంతో స్మార్ట్‌ఫోన్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని డెకరేటివ్ లైట్లలా కూడా వాడుకోవచ్చు.
