అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

కొడంగల్​, వెలుగు: గత ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేసిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ప్రీ-ప్రైమరీ స్కూళ్లుగా అప్​గ్రేడ్ చేస్తూ సదుపాయాలు కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్​-చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు.

కొడంగల్, బోంరాస్​పేట్, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుక్రవారం కొత్త స్మార్ట్ ఫోన్లను ఆయన అందజేశారు. బాలింతలు, పిల్లల పౌష్టికాహార వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.