
మహిళా క్రికెట్ లో టీమిండియా ఓపెనర్.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన హవా చూపిస్తుంది. ఫార్మాట్ ఏదైనా అత్యుత్తమంగా రాణిస్తుంది. ముఖ్యంగా వన్డే, టీ20 ఫార్మాట్ మంధానకు తిరుగులేకుండా పోతుంది. ఇటీవలే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకొని చరిత్ర సృష్టించిన ఈ టీమిండియా ఓపెనర్.. తాజాగా ప్రకటించిన మహిళా టీ20 ర్యాంకింగ్స్ లో 771 రేటింగ్ పాయింట్స్ తో మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో సెంచరీతో చెలరేగింది. 62 బంతుల్లోనే 112 పరుగులు చేసి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించింది.
మంధాన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లతో పాటు 3 సిక్సర్లు ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్ కు ముందు వరకు నాలుగో స్థానంలో ఉన్న స్మృతి.. సెంచరీతో ఒక స్థానం ఎగబాకింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ 794 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్ 774 రేటింగ్స్ తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ తో జరగబోయే మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లోనూ రాణిస్తే మంధాన టాప్ ర్యాంక్ కు చేరే అవకాశం ఉంది. అదే జరిగితే వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ ర్యాంక్ సాధించిన ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.
ALSO READ | Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు లైన్ క్లియర్.. ముంబైకే ఆడనున్న టీమిండియా ఓపెనర్
అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా భారత టీ20 జట్టులో స్థానం సంపాదించిన ఓపెనర్ షఫాలీ వర్మ..టీ20 ర్యాంకింగ్స్ లో 13వ స్థానం నుండి 12వ స్థానానికి ఎగబాకింది. తొలి టీ20లో 22 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఆమె ర్యాంక్ మెరుగవ్వడం విశేషం. జూలై 2023లో చివరి టీ20 ఆడి భారత జట్టుకు దూరమైన హర్లీన్ డియోల్ తొలి టీ20లో 23 బంతుల్లో 43 పరుగులు చేసి తిరిగి ర్యాంకింగ్స్ లో ప్రవేశించింది. టీ20 ర్యాంకింగ్స్ లో ఆమె 86 ర్యాంక్ లో నిలిచింది.
Smriti Mandhana – the backbone of Indian batting. 🙇#Cricket #ICC #India #Smriti pic.twitter.com/GToP15KopW
— Sportskeeda (@Sportskeeda) July 1, 2025