ఎర్రవల్లి/గద్వాల/అలంపూర్,వెలుగు: ఉపాధి పనులు చేస్తుండగా ఇద్దరు కూలీలను పాము కాటేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం గ్రామంలో మంగళవారం ఉదయం కూలీలు ఉపాధి హామీ పనికి వెళ్లారు.
పనుల్లో నిమగ్నమైన సఖినా బేగం, పుల్లమ్మను పాము కాటు వేసింది. దీన్ని గమనించిన ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ సెక్రటరీ వెంటనే108 అంబులెన్స్ లో అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
