పాము తల  సీసాలో ఇరుక్కుపోయింది.. ఎలాగంటే

 పాము తల  సీసాలో ఇరుక్కుపోయింది..  ఎలాగంటే

పాములు పడే బాధలను ఆస్ట్రేలియాకు చెందిన స్నేక్​ క్యాచర్​ సోషల్​ మీడియాలో వివరించారు. ఇటీవల తాను ఒక పాము పడే బాధను చూసి .. ప్రజల వల్ల పాములకు కలిగే ఇబ్బందులను వివరించాడు.  కొంతమంది ఖాళీ సీసాలు... బ్యాటిల్స్​ పడేయడం వల్ల పాము తలను పెట్టి ముందుకు వెళ్లలేక.. బయటకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని టాస్మానియాకు చెందిన స్నేక్​ క్యాచర్​ తెలిపారు. 

ఓ పాము తల ఖాళీ సీసాలో ఉన్న విషయాన్ని గమనించానని తెలిపాడు.  దానిని చాలా జాగ్రత్తగా  అడవిలో వదిలిపెట్టానని  తెలిపారు.  పాము ఖాళీ సీసాలో తల పెట్టడం వల్ల  ఒక కన్ను దెబ్బతిందని.. ఇంకో కన్ను బాగానే ఉందని తెలిపారు.  స్నేక్​ క్యాచర్​తెలిపాడు. 

కొంతమంది ప్రజలు అవగాహన లేకుండా ఖాళీ బాటిల్స్​ బయట పడేయడం పాములకు చాలా ఇబ్బంది కలుగుతుందని స్నేక్​క్యాచర్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు.  ఈ పోస్ట్​ వైరల్​ కావడంతో నెటిజన్లు అనుకూలంగా స్పందించారు.  చెత్త డబ్బాలు బయట వేయకుండా వన్య ప్రాణలను గౌరవించండి అని ఒకరు పోస్ట్​ చేశారు. మరొకరు పాములు పట్టే వ్యక్తికి సోషల్​ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.