20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో..గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన స్నేహ

20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో..గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన స్నేహ

సీనియర్​ నటి స్నేహ(Sneha) పెళ్లి చేసుకుని హీరోయిన్​ పాత్రలకు గుడ్​బై చెప్పేసింది. కొన్ని సినిమాల్లో కీలక రోల్స్​తో మెరిసింది. ఇక సినిమాలకన్నా తన భర్తతో కలిసి యాడ్​ ఫిలింస్​తో పాపులర్​ అవుతోంది. తాజాగా ఈ నటికి సంబంధించిన వార్త ఒకటి వైరలవుతోంది. 

కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్(Thalapathy Vijay)​తో ఈ బ్యూటీ జోడీ కట్టనుందట. వెంకట్​ ప్రభు డైరెక్షన్​లో విజయ్​ నటిస్తున్న 68వ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారట. ఇందులో ఒక హీరోయిన్​గా స్నేహ ఫిక్స్​ అయ్యిందని టాక్​. వీరిద్దరూ 20 ఏళ్ల కిందట ‘వశీకర’ అనే సినిమాలో నటించారు. అది బ్లాక్​బస్టర్​ విజయాన్ని అందుకుంది. వీరిద్దరి పెయిర్​కి మంచి రెస్పాన్స్​ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంటను తెరపై చూపించేందుకు ప్లాన్​ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

Also Read :- యంగ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ?

విజయ్ 68 లో జ్యోతిక ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నట్టు, ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానుంది.  డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్ గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే.