అతనెప్పుడూ బౌలర్ల కెప్టెన్

అతనెప్పుడూ  బౌలర్ల కెప్టెన్


ప్రస్తుతం క్రికెట్ లో ఎవరికైనా బ్యాడ్ డేస్ ఉన్నాయంటే అది భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకే. ఎందుకంటే టీమిండియా కెప్టెన్సీ కోల్పోవడం, రెండు సంవత్సరాల నుంచి ఏ ఫార్మాట్లలో సెంచరీ చేయకపోవడం. మునుపటిలా కోహ్లీ పరుగుల వరద పారించడం లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.  కోల్‌కతాలో 2019 లో బంగ్లాదేశ్‌పై   70వ సెంచరీ చేసిన తర్వాత  అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేదు  కోహ్లీ. దీంతో చాలా మంది కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు. కానీ తన సహచరుడు మహమ్మద్ షమీ  కోహ్లీకి మద్దతు తెలిపాడు.  కోహ్లీ సెంచరీ చేయకపోతే ఏమైంది.. అతను ఎంత గొప్ప ఆటగాడలో ఒక్క సెంచరీ నిర్వచించలేదు. అతను ఇటీవల నిలకడగా అర్ధశతకాలు  చేశాడు. అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను చేసే 50 పరుగులు కూడా జట్టుకు ఉపయోగపడుతున్నాయి. కోహ్లీ బౌలర్ల కెప్టెన్.  కోహ్లీ సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతాడు. బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. అతడితో మేం చాలా కాలం కలిసి ఉన్నాం.