V6 News

తడబడిన ఆర్సీబీ.. హాఫ్ సెంచరీతో చెలరేగిన సాల్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే!

తడబడిన ఆర్సీబీ.. హాఫ్ సెంచరీతో చెలరేగిన సాల్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే!

RCB vs DC: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆశించిన స్థాయిలో మెరవలేకపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాటిదార్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆర్సీబీ స్కోర్ బోర్డ్ ఊగిసలాడింది. 

సాల్ట్ క్లాస్.. కోహ్లీ మాస్ ఆరంభం: 
ఇన్నింగ్స్ మొదట్లో ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ పక్కా ప్లానింగ్‌తో చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. అయితే, లుంగి ఎంగిడి బౌలింగ్‌లో విరాట్ (19) అవుటవ్వడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (18) ధాటిగా ఆడే ప్రయత్నంలో అక్షర్ పటేల్ బుట్టలో పడ్డాడు. ఇక ఈ సీజన్‌లో విధ్వంసకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (8) ఈ మ్యాచ్‌లో మాత్రం ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. ముకేశ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి త్వరగానే వెనుదిరిగాడు. కానీ, మరోవైపు ఫిల్ సాల్ట్ మాత్రం ఢిల్లీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 రన్స్ చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. చివరకు కుల్దీప్ మ్యాజిక్ బాల్‌కు సాల్ట్ ఔట్ అయ్యాడు.

టిమ్ డేవిడ్ ‘మాస్’ ఇన్నింగ్స్: 
మిడిల్ ఓవర్లలో టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 26) 3 ఫోర్లు, ఒక సిక్సుతో స్టేడియాన్ని దద్దరిల్లజేసినప్పటికీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటై షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రోమారియో షెపర్డ్ (1), జితేష్ శర్మ (14), కృనాల్ పాండ్యా (12) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 175 రన్స్ కి పరిమితమైంది. 

ఢిల్లీ బౌలర్ల ‘నయా’ ప్లాన్: 
ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి తలో రెండు వికెట్లతో ఆర్సీబీని కట్టడి చేశారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ పారడైజ్ గ్రౌండ్‌లో 176 పరుగుల లక్ష్యం అంటే ఢిల్లీకి ఈజీనే అనిపిస్తోంది. మరి హోమ్ గ్రౌండ్‌లో ఆర్సీబీ బౌలర్లు ఈ స్కోరును డిఫెండ్ చేస్తారో లేదో చూద్దాం..