
ఢిల్లీ : రాబోయే పార్లమెంట్ ఎన్నికల క్రమంలో ఫేక్ న్యూస్ ను అరికట్టాలని చూస్తుంది పార్లమెంటరీ కమిటీ. ప్రచారంలో వార్తల ప్రభావం ఎక్కవ ఉంటుందని ..దీనిపై ఫొకస్ పెట్టినట్లు తెలిపారు అధికారులు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా వేదికలన్నీ ఫేక్ న్యూస్ ను బ్యాన్ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఐటీపై బుధవారం పార్లమెంటరీ కమిటీ కోరింది. ఎన్నికల కమిషన్ తో సమన్వయంతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కి చెక్ పెట్టాలని సూచించింది. పలు సోషల్ మీడియాల వేదికలపై యూజర్ల డేటా పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ..సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఈ కమిటీ ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ తదితర సంస్థలను కోరింది.
ఎన్నికల సమయంలో ఫేక్ న్యూస్ ను బ్యాన్ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తూ రిపోర్టులు అందించాలని అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఆయా సంస్థలను ఆదేశించింది. అసత్య వార్తలు సహా తలెత్తే పలు అంశాలను రియల్ టైమ్ లో పరిష్కరించేందుకు ఆయా సంస్థలు రెడీ కావాలని, రానున్న ఎన్నికల్లో ఈసీతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల వ్యవహారంలో పారదర్శకతతో కూడిన విధానాన్ని సోషల్ మీడియా వేదికలు ప్రవేశపెట్టాలని కోరింది.