రేవంత్ చెప్పులు vs కవిత వాచీ.. సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్స్

రేవంత్ చెప్పులు vs కవిత వాచీ.. సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్స్
  • రేవంత్ చెప్పులు రూ. 50 వేలన్న బీఆర్ఎస్
  • రూ. 20 లక్షల వాచీ పెట్టావంటున్నరేవంత్ ఫ్యాన్స్

సీఎం రేవంత్ రెడ్డి చెప్పులు, కవిత వాచీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశాలుగా మారాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారి కామెంట్ల తూటాలు పేలుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్  ఎత్తిచూపుతుంటే వాటికి కౌంటర్ గా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు సెల్ఫ్ గోల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులపై బీఆర్ఎస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించగా ఈ విమర్శల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుచ్చి బ్రాండ్ చెప్పులు ధరించిన రేవంత్ రెడ్డి ఫొటోను షేర్ చేస్తూ 'రూ.50 వేల ఖరీదైన చెప్పులు వేసుకున్న రైతు బిడ్డ' అని బీఆర్ఎస్ అనుచరులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

రేవంత్ రెడ్డి ధరించిన చెప్పులకు కేసీఆర్ ధరించిన చెప్పులతో కంపారీజన్ చేస్తూ దొరపాలన చేసిన కేసీఆర్ నాలుగు వందల చెప్పులు ధరిస్తే ప్రజాపాలన చేసేవారు యాబైవేల చెప్పులు ధరిస్తున్నారంటూ విమర్వలు చేస్తున్నారు.  బీఆర్ఎస్ చేస్తున్న ట్రోల్స్ పై నెటిజన్లు, కాంగ్రెస్ మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో గులాబీ పార్టీ మద్దతుదారులకు కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చివరకు ఖరీదైన చెప్పులు ధరించినా ఏడ్చే స్థాయికి దిగజారారా? అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ధరించిన చెప్పుల సంగతి అటుంచి.. సో కాల్డ్ రైతు బిడ్డ కవిత మాత్రం రూ.20 లక్షల వాచ్ పెట్టవచ్చా? అని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ ప్రకారం రైతులకు మంచి బట్టలు, ఖరీదైన చెప్పులు ధరించే అర్హత లేదా ఇదేనా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వ అవినీతిని సీఎం బయటకు తీస్తుంటే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి చెప్పులపై పడి ఏడుస్తోందంటూ ఫైర్ అవుతున్నారు.