ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం  సీరియస్

ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS  అధికారుల సంఘం  సీరియస్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం  సీరియస్ అయింది. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్న వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు  ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు  ఉన్నాయని వెల్లడించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది.