‘బూట్‌‌కట్ బాలరాజు’ గా సోహైల్

‘బూట్‌‌కట్ బాలరాజు’ గా  సోహైల్

‘బిగ్‌‌బాస్’ షోతో గుర్తింపు తెచ్చుకుని, వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు సయ్యద్ సోహైల్.  రీసెంట్‌‌గా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం ‘బూట్‌‌కట్ బాలరాజు’ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీ కోణేటి దర్శకత్వంలో ఎం.డి.భాష నిర్మిస్తున్నారు.  

మంగళవారం సోహైల్ బర్త్‌‌డే సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌తో తనకు విషెస్ చెప్పారు మేకర్స్.  చేతిలో కల్లు సీసాతో లుంగీ కట్టుకున్న సోహైల్ లుక్ ఆకట్టుకుంటుంది. విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ మూవీ తెరకెక్కుతోందని పోస్టర్‌‌‌‌ని బట్టి తెలుస్తోంది.  అనన్య నాగళ్ల హీరోయిన్‌‌. ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ అని, షూటింగ్ పూర్తి అయ్యిందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు దర్శక నిర్మాతలు.