ఎస్సీ, ఎస్టీలు మంత్రులవ్వడాన్ని సహించలేకపోతున్నరు

ఎస్సీ, ఎస్టీలు మంత్రులవ్వడాన్ని సహించలేకపోతున్నరు

న్యూఢిల్లీ: లోక్‌సభలో కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కొత్త మంత్రులను సభకు పరిచయం చేసేందుకు ప్రధాని మోడీ లేవగా.. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. వెల్‌‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనేకమంది మహిళలు, దళితులు, ఓబీసీలు, రైతులు మంత్రులయ్యారని.. వారిని చూసి అందరూ గర్విస్తారని తాను భావించానని మోడీ చెప్పారు.

వెనకబడిన వర్గాలకు చెందినవారు మంత్రులు కావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేనట్టుగా ఉందని మోడీ మండిపడ్డారు. అందుకే పరిచయాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మహిళలతోపాటు ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీ కమ్యూనిటీలకు చెందిన వారు మంత్రులు కావడాన్ని కొందరు సహించలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వారు, మహిళలు మంత్రులు కావడం గర్వకారణం’ అని మోడీ పేర్కొన్నారు.