కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఒకలా.. దేశంలో ఇంకోలా వ్యవహరిస్తున్నాయి: తమిళిసై

కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఒకలా.. దేశంలో ఇంకోలా వ్యవహరిస్తున్నాయి: తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి, గవర్నర్​లు రాజకీయేతర వ్యక్తులని తెలంగాణ గవర్నర్​ తమిళిసై అన్నారు. ‘‘తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గవర్నర్, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారికి రెస్పెక్ట్‌‌ ఇవ్వడం లేదు. కానీ, ఇప్పుడు దేశంలో కాన్​స్టిట్యూషన్​హెడ్​కు అవమానం జరుగుతోందం టూ గగ్గోలు పెడుతున్నయి” అని అన్నారు. గురువారం చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ కు తనను ఆహ్వానించలేదని, ఓపెనింగ్​పై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ ఓపెనింగ్​కు రాష్ట్రపతిని ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లను ఆమె తప్పు బట్టారు. 

రాష్ట్రంలో ఒక రకంగా వ్యవహరిస్తూ.. కేంద్రంలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి వి తాను పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పారు. ట్రైబల్ ఏరియాల్లో పర్యటిస్తూ, వారి కోసం పలు కార్య క్రమాలు నిర్వహించటం తనకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ట్రైబల్ పబ్లిక్ తనను అక్కగా పిలుస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలు మర్యాద ఇవ్వకున్నా ప్రజలు తనను ఎంతో గౌరవిస్తున్నా రని అది చాలని గవర్నర్​ తమిళిసై పేర్కొన్నారు.