బీహార్ఎన్నికల్లో సరికొత్త పెట్రోలింగ్..గుర్రాలు,పడవలపై

బీహార్ఎన్నికల్లో సరికొత్త పెట్రోలింగ్..గుర్రాలు,పడవలపై

బీహార్​ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్​ అయింది.243 శాసనసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) సోమవారం(అక్టోబర్​06) ప్రకటించింది. నవంబర్​ 6, నంబర్​ 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.  బీహార్​ లో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా  గుర్రాలు, పడవలపై పెట్రోలింగ్​ కు ఏర్పాటు చేసింది ఈసీ.

బీహార్ లో మొత్తం 90 వేల 712 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహించనున్నట్లు ఈసీతెలిపింది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సరాసరి ఓట్లు 818గా కేటాయించింది ఈసీ. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ బూత్ లు 13 వేల 911 ఏర్పాటు చేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో పోలింగ్ బూతులు 76 వేల 801 ఏర్పాటు చేస్తోంది. అన్ని పోలింగ్ కేంద్రాలను 100 శాతం వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది ఈసీ.

పోలింగ్​ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు అదనపు కేంద్ర బలగాలు గస్తీ సేవల్లో పాల్గొంటున్నాయి. కొత్తగా గస్తీలో గుర్రాలు, పడవలను వినియోగిస్తున్నారు. సెన్సిటివ్​ ప్రాంతాల్లో 250 పోలింగ్ కేంద్రాలకు గుర్రపు గస్తీ సేవలు అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో  పెట్రోలింగ్ పార్టీలు దాదాపు 197 పోలింగ్ స్టేషన్లలో పడవల ద్వారా గస్తీ నిర్వహించనున్నాయి. 

ALSO READ : బీహార్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్: నవంబర్ 14 కౌంటింగ్

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా వాటిలో 38 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు (SC),షెడ్యూల్డ్ తెగలకు (STలు) రిజర్వ్  చేశారు. బీహార్​లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో ..పురుష ఓటర్లు3.92 కోట్లు, 3.50 కోట్ల మంది మహిళా ఓటర్లు, 1,725 ​​మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.  వీరిలో 14.01 లక్షల మంది మొదటిసారి ఓటువేస్తున్నారని ఈసీ తెలిపారు.