జూన్​ 26 నుంచి జులై 2 వరకు 36 రైళ్లు రద్దు

జూన్​ 26 నుంచి జులై 2 వరకు 36 రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 36 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్–-సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ రిపేర్ పనుల కారణంగా ఈ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  కాజీపేట్–-డోర్నకల్, డోర్నకల్–కాజీపేట,- డోర్నకల్–విజయవాడ,- డోర్నకల్–భద్రాచలం-, విజయవాడ– -భద్రాచలం, సికింద్రాబాద్–-వికారాబాద్, వికారాబాద్–​కాచిగూడ, సికింద్రాబాద్–​ -వరంగల్,  వరంగల్​–-హైదరాబాద్​, సిర్పూర్​టౌన్​–- కరీంనగర్,  కరీంనగర్ –​-నిజామాబాద్,  కాజీపేట-– సిర్పూర్​ టౌన్​, కాజీపేట– బల్లార్షా,- భద్రాచలం-– బల్లార్షా, సిర్పూర్ టౌన్ –​ -భద్రాచలం మధ్య నడిచే రైళ్లు జులై 2  వరకు అందుబాటులో  ఉండవని అధికారులు తెలిపారు. అలాగే  ఇవ్వాల నడిచే మహబూబ్​నగర్​–- కాజీపేట, కాచిగూడ– -రాయచూర్, రాయచూర్–గద్వాల్,​-  రాయచూర్– కాచిగూడ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు
అధికారులు తెలిపారు.

26 ఎంఎంటీఎస్​ సర్వీసులు

ట్రాక్ రిపేర్ పనుల కారణంగా సిటీలో 26 ఎంఎంటీఎస్ సర్వీసులను రేపటి నుంచి జులై 2 వరకు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. లింగంపల్లి – హైదరాబాద్,   ఉందానగర్ – లింగంపల్లి, ఉందానగర్ – ఫలక్ నుమా, లింగంపల్లి – ఫలక్ నుమా, రామచంద్రాపురం – ఫలక్ నుమా మధ్య నడిచే   సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.