కామారెడ్డి జిల్లాలో అత్తను చంపిన అల్లుడు

కామారెడ్డి జిల్లాలో అత్తను చంపిన అల్లుడు
  • కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన

పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు అత్తను అల్లుడు గొంతు కోసి హత్య చేశాడు. పిట్లం మండలం బ్రహ్మణ్​పల్లి గ్రామానికి చెందిన జిన్న లక్ష్మి.. అల్లుడు జిన్న బాలరాజుకు అప్పు ఇచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని బాలరాజును లక్ష్మి నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

అత్తపై కోపం పెంచుకున్న బాలరాజు.. గురువారం స్థానిక స్కూల్​లో మధ్యాహ్న భోజనం వండి ఇంటికి వెళ్తున్న లక్ష్మిని అడ్డుకున్నాడు. ఆమెతో గొడవపడి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి చంపేశాడని ఎస్ఐ రాజు తెలిపారు. మృతురాలి కొడుకు జిన్న రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.