మేదాంత ఆసుపత్రికి వాంగ్చుక్.. హైకోర్టు అనుమతితో తరలింపు

మేదాంత ఆసుపత్రికి వాంగ్చుక్.. హైకోర్టు అనుమతితో తరలింపు

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వాంగ్ చుక్ మద్దతుదారుల ఆందోళనను తోసిపుచ్చలేమని చెబుతూ ఆసుపత్రి మార్పునకు అనుమతించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం సాయంత్రం సఫ్దర్‌‌‌‌‌‌‌‌జంగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. 

ఈ సందర్భంగా సఫ్దర్‌‌‌‌‌‌‌‌జంగ్ ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం సాయంత్రం 6:40 గంటలకు డిశ్చార్జ్ చేసి, తదుపరి ట్రీట్​మెంట్​కోసం గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌లోని మేదాంత ఆసుపత్రి డాక్టర్ల బృందానికి అప్పగించినట్టు తెలిపింది. 

డిశ్చార్జ్ సమయంలో ఆయన హెల్త్​పారామీటర్స్ అన్నీ​స్టేబుల్​గా ఉన్నాయని తెలిపింది. అయితే, పాన్సైటోపేనియా (ప్యాన్‌‌‌‌‌‌‌‌సైటోపేనియా) సమస్య కొనసాగుతోందని తెలిపింది. ట్రీట్​మెంట్​లో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత మెడికల్​రిపోర్ట్స్, డాక్యుమెంట్లను మేదాంత డాక్టర్ల టీంకు అందించినట్లు వెల్లడించింది. 

నీట్ పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌పై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళనలలో భాగంగా నిరాహార దీక్ష చేసిన వాంగ్​చుక్​ను పోలీసులు బలవంతంగా సఫ్దార్​జంగ్​ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు బెంచ్ తాజాగా సానుకూలంగా స్పందించింది.