సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది. సర్గంగారామ్ ఆస్పత్రి వైద్యుల వెల్లడి

సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది. సర్గంగారామ్ ఆస్పత్రి వైద్యుల వెల్లడి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కోలుకుంటున్నారని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి ఆమె జ్వరంతో ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీకి ‘‘సిస్టమిక్ ఇన్ఫెక్షన్”తో బాధపడుతుండగా యాంటీబయాటిక్స్ చికిత్స అందిస్తున్నామ ని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. 

వాతావరణ మార్పుల వల్ల ఆమె అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. మరో రెండు రోజులు అబ్జర్వేషన్​లో ఉంచుతామని తెలిపారు. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఆమె ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు స్పష్టం చేశారు.