నకిలీ పాల ఉత్పత్తి కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసుల దాడి

 నకిలీ పాల ఉత్పత్తి కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసుల దాడి

హైదరాబాద్ లో నకిలి పాల ఉత్పత్తి దారులు రెచ్చి పోతున్నారు,  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో  పాల ఉత్పత్తి కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.  సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన గజేందర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 300 కిలోల పనీర్, 4 వేల 500లీటర్ల రిపైండ్ ఫామాయిల్, 750లీటర్ల అసిటిక్ యాసిడ్,  16 వేల 250 కిలోల  స్కీమ్డ్ మిల్క్ పౌడర్, 15లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్ తో పాటు పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే ఇతర ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.