V6 News

ఇన్ టైంలో రావడం వల్లే ప్రమాదం తప్పింది

ఇన్ టైంలో రావడం వల్లే ప్రమాదం తప్పింది
గుండెపోటుతో హాస్పిటల్ లో చేరిన BCCI ప్రెసిడెంట్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు వుడ్ ల్యాండ్ హాస్పిటల్ డాక్టర్లు. గుండె రక్త నాళాల్లో రెండు అడ్డంకులు ఏర్పడ్డాయని.. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశామన్నారు. యాంజియోప్లాస్టి తర్వాత ఆయన కోలుకున్నారని చెప్పారు. ఉదయం గుండెపోటు రావడంతో గంగూలీని.. కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. ఇక.. గంగూలీని వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్కర్, సీఎం మమతా బెనర్జీతోపాటు.. కొందరు నేతలు పరామర్శించారు. ఆయనతో మాట్లాడామని ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇన్ టైంలో రావడం వల్లే ప్రమాదం తప్పిందన్నారు డాక్టర్లు.