T20 World Cup 2026: స్టబ్స్, రికెల్టన్ బ్యాక్.. వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా కీలక ప్లేయర్స్ దూరం

T20 World Cup 2026: స్టబ్స్, రికెల్టన్ బ్యాక్.. వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా కీలక ప్లేయర్స్ దూరం

ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ స్క్వాడ్ లో కీలక మార్పులు చేసింది. ఈ మెగా టోర్నీకి ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాల కారణంగా అందుబాటులో ఉండడం లేదు. టోనీ డి జోర్జీ, డోనోవన్ ఫెర్రీరా గాయాల కారణంగా ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ ఆడడం లేదని క్రికెట్ సౌతాఫ్రికా (CSA) గురువారం (జనవరి 22) ధృవీకరించింది. వీరి స్థానాల్లో ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ లకు సౌతాఫ్రికా వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కింది. 

జనవరి 2న సౌతాఫ్రికా ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో మెరుపులు మెరిపించే ట్రిస్టన్ స్టబ్స్ సౌతాఫ్రికా జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. ఫామ్ లో ఉన్న వీరిద్దరిని తప్పించడంతో విమర్శలు వచ్చాయి. అయితే టోనీ డి జోర్జీ, డోనోవన్ ఫెర్రీరా లకు గాయాలు కావడంతో స్టబ్స్, రికెల్ టన్ జట్టులోకి వచ్చారు. డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి లాంటి కీలక ప్లేయర్లు స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు. వీరిద్దరూ త్వరగా కోలుకుంటారని సౌతాఫ్రికా క్రికెట్ ఆశిస్తోంది. 

2024 రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికాతో పాటు గ్రూప్ డి లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఉన్నాయి. వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ను  ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడతారు.  పక్కటెముకల  గాయం కారణంగా టీమిండియాతో టీ20సిరీస్ కు దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా తిరిగి జట్టులోకి చేరాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాప్ ఆర్డర్ బ్యాటర్ జాసన్ స్మిత్ జట్టులోకి రావడం. స్మిత్ కు కేవలం ఐదు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన అనుభవం ఉన్నప్పటికీ ఎంపిక చేశారు.

2026 టీ20 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా జట్టు:

ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్,  మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో  రబడా, జాసన్ స్మిత్