టీ20 ట్రై-సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా

టీ20 ట్రై-సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా

హరారే: టీ20 ట్రై-సిరీస్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ కూడా ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. తొలుత జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 144/6 స్కోరు చేసింది. బ్రయాన్ బెనెట్ (61) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా నిలవగా, సఫారీ బౌలర్ కార్బిన్ బోష్ 2 వికెట్లు తీశాడు.  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్లు ఫెయిలైనా యంగ్ బ్యాటర్ రుబిన్ హెర్మన్ (63), కెప్టెన్ వాండర్ డస్సెన్ (52 నాటౌట్‌‌) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో సౌతాఫ్రికా 17.2 ఓవర్లలోనే 145/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. శనివారం జరిగే ఫైనల్‌‌‌‌‌‌‌‌కు ముందు  మంగళవారం చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.