సౌతాఫ్రికా బోణీ.. తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గెలుపు

సౌతాఫ్రికా బోణీ.. తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గెలుపు

కార్డిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా బోణీ చేసింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్కో యాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/18), కార్బిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/20) చెలరేగడంతో... బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఫారీలు 14 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడా (డక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచారు. ఫలితంగా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. భారీ వర్షం వల్ల ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 9 ఓవర్లకు కుదించారు. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో 97/5 స్కోరు చేసింది. 

వాన వల్ల ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంతరాయం కలగడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపేశారు. ఐడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (28), డోనోవన్ ఫెర్రీరా (25 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డేవ్లాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (23) మెరుగ్గా ఆడారు. రికెల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), ప్రిటోరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2), స్టబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13) నిరాశపర్చారు. ల్యూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, ఒవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు. తర్వాత ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 5 ఓవర్లలో 69 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్దేశించారు. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జట్టు 54/5 స్కోరుకే పరిమితమైంది. బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), బెథెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7), బాంటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5) ఫెయిలయ్యారు. రబాడ ఒక వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడగొట్టాడు. ఫెర్రీరాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.