
హైదరాబాద్: ఈ నెల 27 నాటికి దేశంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నుంచి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ సారి మూడు రోజుల ముందే దేశంలోకి ప్రవేశించనున్నాయి.
కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. అత్యంత వేగంగా 1918లో మే 11న, అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. 2009లో మే 23న కేరళలోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఈ ఏడాది ఐఎండీ ఊహించిన విధంగా నైరుతి రుతుపవనాలు తాకితే, 2009 తర్వాత అతి త్వరగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అవుతుంది.
►ALSO READ | ఇలాంటి మామిడి పండ్లు తింటే.. రోగం వచ్చి చస్తాం : అధికారుల తనిఖీల్లో బయటపడిన ఘోరం
అయితే రుతుపవనాల కేరళను తాకిన తేదీకి, దేశవ్యాప్త వర్షపాత శాతానికి ఎలాంటి సంబంధం లేదని ఐఎండీ అధికారి వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మొత్తం వర్షాకాలంలో ఎల్ నినో తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని తెలిపింది. సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.