డయల్ 100కు వెంటనే స్పందించాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు 

డయల్ 100కు వెంటనే స్పందించాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డయల్ 100కు ఫోన్ రాగానే వెంటనే స్పందించి స్పాట్​కు వెళ్లి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ బి.రోహిత్​ రాజు సూచించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్​లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రతి కేసును దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.  భద్రాచలం ఎస్పీ విక్రాంత్ కుమార్​ సింగ్, డీఎస్పీలు ఎల్.ఆదినారాయణ, సతీశ్ కుమార్, రవీందర్​రెడ్డి, వెంకన్న బాబుతోపాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.