
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు ఆయన తనయుడు ఎస్పీ చరణ్. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం క్రమంగా కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని, ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి డాక్టర్లకు… ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.