ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మాట్లాడుతూ కోట్లాది మంది అభిమానుల ప్రార్ధనల వల్ల తనతండ్రి ఆరోగ్యం కుదుట పడిందని అని అన్నారు. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన చరణ్..ఇదో శుభదినం, త్వరలోనే ఎస్పీబాల సుబ్రహ్మణ్యం కోలుకొని ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
