డయల్ 100కు వెంటనే స్పందించాలి : ఎస్పీ రోహిత్ రాజ్

డయల్ 100కు వెంటనే స్పందించాలి : ఎస్పీ రోహిత్ రాజ్

పాల్వంచ, వెలుగు : బాధితులు తక్షణ సాయం కోసం కాల్ చేసే 100కు పోలీసులు వెంటనే స్పందించాలని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని కిన్నెరసానిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ కె.సతీశ్, ఎస్ఐ సురేశ్, సిబ్బంది ఉన్నారు.