స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురు నిర్వాహకులు అరెస్టు

స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురు నిర్వాహకులు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి భాగ్యనగర్ కాలనీలోని చార్మ్ బ్యూటీ స్పా సెంటర్​పై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేశారు.  స్పా ముసుగులో సాగుతున్న వ్యభిచార దందాలో ఆరుగురు మహిళా బాధితులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఏ1 పైడుముల దివ్య, సబ్ ఆర్గనైజర్లు అల్వాల సంగీత మాధురి, జయప్రకాశ్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఘటనా స్థలంలో రూ. 9,100 నగదు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.