స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ వాల్యూ రూ.170 లక్షల కోట్లు.. ఐపీఓకి రెడీ అవుతున్న మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ

స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ వాల్యూ రూ.170 లక్షల కోట్లు.. ఐపీఓకి రెడీ అవుతున్న మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ
  • ఏడో అత్యంత విలువైన కంపెనీగా అవతరణ

న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్ల  వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ఐపీఓకి రావడానికి రెడీ అవుతోంది.  అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపీఓగా  నిలవనుంది.  కంపెనీ దాదాపు 55.56 కోట్ల షేర్లను, ఒక్కో షేరును 135 డాలర్ల  వద్ద విక్రయించి 75 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ విజయవంతమైతే, స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ మార్కెట్ విలువ 1.77 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.170 లక్షల కోట్ల) కు చేరుకుంటుంది.  

జూన్ 2024 నాటికి కేవలం 210 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ వాల్యుయేషన్,   డిసెంబర్ 2025 (ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడర్ టెండర్ ఆఫర్) నాటికి దాదాపు 800 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  (ఐపీఓ కంటే ముందు ప్రైవేట్ మార్కెట్)దాదాపు 1.25 నుంచి 1.5 ట్రిలియన్ డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.  మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ, సోషల్ మీడియా కంపెనీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇప్పటికే  స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విలీనమయ్యాయి. 

దీనికితోడు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ సబ్సిడరీ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్ తన శాటిలైట్ ఆధారిత గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తరిస్తోంది. ఈ కంపెనీ సాధిస్తున్న రికార్డు స్థాయి వృద్ధి,  లాభాలు ఈ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కీలకంగా మారాయి. అమెరికా ప్రభుత్వం నుంచి  స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్, రక్షణ ఒప్పందాలు సాధించడం కలిసొచ్చింది.  స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన 7వ అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది.