కింగ్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌ నెగ్గిన స్పెయిన్​ స్టార్​ అల్కరాజ్‌‌‌‌

కింగ్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌ నెగ్గిన స్పెయిన్​ స్టార్​ అల్కరాజ్‌‌‌‌
  •    ఫైనల్లో జొకోవిచ్‌‌‌‌పై అద్భుత విజయం
  •    కెరీర్​లో రెండో గ్రాండ్​స్లామ్​ సొంతం

కార్లోస్‌‌ అల్కరాజ్‌‌ గార్ఫియా.. పేరుకు టాప్‌‌ సీడ్‌‌, వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ అయినా.. ఎదురుగా తన వయసంత అనుభవం ఉన్న లెజెండ్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ అడ్డుగా ఉన్నాడు. 23 గ్రాండ్‌‌ స్లామ్స్‌‌ నెగ్గి, వరుసగా ఐదుసార్లు వింబుల్డన్‌‌ టైటిల్స్‌‌ గెలిచి ఇక్కడి సెంట్రల్​ కోర్టులో వరుసగా 45 విజయాలతో  జొకో యమ జోరు మీదున్నాడు. అయినా 20 ఏండ్ల కార్లోస్‌‌ వెరవలేదు. తొలి సెట్‌‌లో గా ఓడినా బెదరలేదు. నంబర్‌‌ వన్‌‌ హోదాకు న్యాయం చేసిన ఈ  స్పెయిన్‌‌ చిన్నోడు ఖతర్నాక్‌‌ ఆట చూపెట్టాడు. అద్భుతమైన సర్వీస్‌‌లు, కండ్లు చెదిరే రిటర్న్​లు.. విస్మయం కలిగించే విన్నర్లతో సెర్బియా స్టార్‌‌  జొకోపని పట్టాడు. ఐదు సెట్ల మారథాన్‌‌ మ్యాచ్‌‌లో గెలిచి వింబుల్డన్‌‌లో కొత్త కింగ్‌‌గా నిలిచాడు.

వింబుల్డన్‌‌‌‌ : ప్రతిష్టాత్మక వింబుల్డన్‌‌‌‌  గ్రాండ్‌‌‌‌స్లామ్ టెన్నిస్‌‌‌‌ టోర్నీలో కొత్త డాన్‌‌‌‌ వచ్చాడు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఫ్యూచర్‌‌‌‌ తనదే అని చాటిచెబుతూ వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌, స్పెయిన్‌‌‌‌ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌  కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో రెండో మేజర్‌‌‌‌ టైటిల్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. ఆల్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌లో  ఎనిమిదో టైటిల్‌‌‌‌ నెగ్గి స్విస్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ రోజర్‌‌‌‌ ఫెడరర్‌‌‌‌ రికార్డు సమం చేయాలని ఆశించిన సెర్బియా లెజెండ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.  వింబుల్డన్‌‌‌‌ హిస్టరీలోనే గుర్తుండిపోయేలా ఆదివారం రాత్రి సెంట్రల్‌‌‌‌ కోర్టులో అత్యంత హోరాహోరీగా సాగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌  1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4తో రెండో సీడ్‌‌‌‌ నొవాక్‌‌‌‌పై గెలిచాడు. వింబుల్డన్​ మెన్స్​ సింగిల్స్​ టైటిల్​ నెగ్గిన మూడో యంగెస్ట్​ ప్లేయర్​గా నిలిచాడు.

 4 గంటల 42 నిమిషాల ఫైట్‌‌‌‌లో 9 ఏస్‌‌‌‌లు, 66 విన్నర్లు కొట్టిన అల్కరాజ్‌‌‌‌ ఐదు బ్రేక్‌‌‌‌ పాయింట్లు సాధించాడు. 7 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 45 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేశాడు. జొకో 3 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 40 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసినా.. రెండే ఏస్‌‌‌‌లు, 32 విన్నర్లు మాత్రమే కొట్టి నిరాశ పరిచాడు. దాంతో, 24వ రికార్డు గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ నెగ్గాలన్న అతని కోరిక నెరవేరలేకపోయింది. ఇక సెంట్రల్‌‌‌‌ కోర్టులో వరుసగా 45 మ్యాచ్‌‌‌‌లు గెలిచిన జొకో విజయయాత్రకు కార్లోస్‌‌‌‌ రూపంలో బ్రేక్‌‌‌‌ పడింది. గతేడాది యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో తొలి గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ నెగ్గిన అల్కరాజ్‌‌‌‌కు ఇది రెండో మేజర్‌‌‌‌ టైటిల్‌‌‌‌. 

ALSO READ :మత విద్వేషాలతో నీచ రాజకీయాలు; ఆర్ఎస్ ప్రవీణ్ కుమా

థ్రిల్లింగ్‌‌‌‌ ఫైట్‌‌‌‌

టాప్‌‌‌‌ సీడ్ల మధ్య టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌ వన్‌‌‌‌సైడ్‌‌‌‌గా మొదలై హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌‌‌‌లో నొవాక్‌‌‌‌  సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేశాడు. అల్కరాజ్‌‌‌‌ మిస్టేక్స్‌‌‌‌ను సద్వినియోగం చేసుకుంటూ  రెండో, నాలుగో గేమ్స్‌‌‌‌లో సర్వీస్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేసిన అతను ఈజీగా సెట్ నెగ్గాడు. అతని ఊపు చూస్తుంటే వరుస సెట్లలో కార్లోస్‌‌‌‌ పని పట్టేలా కనిపించాడు. కానీ, అల్కరాజ్‌‌‌‌ బలంగా పుంజుకున్నాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన రెండో సెట్‌‌‌‌ను  టై బ్రేక్‌‌‌‌కు తీసుకెళ్లాడు. టై బ్రేక్‌‌‌‌ చివర్లో జొకో బ్యాక్​హ్యాండ్​ తప్పిదాలతో రెండు పాయింట్ల కోల్పోగా.. కార్లోస్​ బ్యాక్​హ్యాండ్​ విన్నర్​ కొట్టి సెట్ నెగ్గి స్కోరు 1–1తో సమం చేశాడు.  మూడో సెట్‌‌‌‌లో అసలు ఆట మొదలైంది. ఇక్కడి నుంచి అల్కరాజ్‌‌‌‌ తన విశ్వరూపం చూపెట్టాడు. కోర్టులో పాదరసంలా కదిలాడు. కండ్లు చెదిరే రిటర్న్​లతో జొకోను  ఉక్కిరిబిక్కిరి చేశాడు.

మరోవైపు తొలి గేమ్‌‌‌‌లోనే సర్వీస్‌‌‌‌ పోగొట్టుకున్న సెర్బియా లెజెండ్‌‌‌‌ ఐదో  గేమ్‌‌‌‌లో సర్వీస్‌‌‌‌ నిలబెట్టు కోవడం కోసం ఎంతో శ్రమించాడు. 26 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌ సినిమాను తలపించింది. ఏకంగా 13 డ్యూస్‌‌‌‌లు నమోదైన గేమ్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌ ఏడో బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌లో గేమ్‌‌‌‌ నెగ్గి సెట్‌‌‌‌లో 4–1తో లీడ్‌‌‌‌ సాధించాడు. అదే జోరు కొనసాగించిన అతను.. జోకో సర్వ్‌‌‌‌  ఏడో గేమ్‌‌‌‌లో బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ పాస్‌‌‌‌తో మరో బ్రేక్‌‌‌‌తో సెట్ నెగ్గాడు. దాంతో, ఓవరాల్‌‌‌‌గా 2–1తో ఆధిక్యంలోకి వచ్చాడు. 
     

ఇక, మ్యాచ్‌‌‌‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన నాలుగో సెట్‌‌‌‌లో నొవాక్‌‌‌‌ పుంజుకున్నాడు. బ్రేక్‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత మెరుగ్గా ఆడాడు. రెండో గేమ్‌‌‌‌లో కోర్టులో జారి పడినప్పటికీ ప్రత్యర్థికి కౌంటర్‌‌‌‌ ఇచ్చాడు. ఐదో  గేమ్‌‌‌‌లో కీలక బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ సాధించాడు. ఆపై కార్లోస్‌‌‌‌ డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌ చేయడంతో తొమ్మిదో గేమ్‌‌‌‌తో పాటు సెట్‌‌‌‌ నెగ్గిన జొకో మ్యాచ్‌‌‌‌ను ఐదో సెట్‌‌‌‌కు తీసుకెళ్లాడు.  ఇందులో మూడో గేమ్‌‌‌‌లో బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌తో బ్రేక్‌‌‌‌ సాధించిన కార్లోస్‌‌‌‌ ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లతో మరో గేమ్‌‌‌‌ నెగ్గాడు. ఆపై, ఆరో గేమ్‌‌‌‌లో ఏస్‌‌‌‌ కొట్టి సర్వీస్‌‌‌‌ నిలబెట్టుకుంటూ 4–2తో లీడ్‌‌‌‌లోకి వచ్చాడు.

ఏడో గేమ్‌‌‌‌లో నొవాక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ నిలుపుకున్నా.. ఎనిమిదో గేమ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌, ఏస్‌‌‌‌ కొట్టిన స్పెయిన్‌‌‌‌ స్టార్‌‌‌‌ 5–3తో టైటిల్‌‌‌‌ ముంగిట నిలిచాడు. చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ కోసం సర్వీస్‌‌‌‌ చేసిన అల్కరాజ్‌‌‌‌ ఓ ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌, ఆ వెంటనే అద్భుతమైన బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ వ్యాలీ విన్నర్‌‌‌‌ వేశాడు. ఆ తర్వాత నొవాక్‌‌‌‌ కొట్టిన రిటర్న్‌‌‌‌ నెట్‌‌‌‌కు తగలడంతో విన్నింగ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ నెగ్గిన అల్కరాజ్‌‌‌‌ విజయానందంలో మునిగిపోయాడు.