టెన్నిస్ లెజెండ్ రఫెల్ నడాల్ రీఎంట్రీ అదుర్స్

టెన్నిస్ లెజెండ్ రఫెల్ నడాల్ రీఎంట్రీ అదుర్స్

బ్రిస్బేన్: గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమైన స్పెయిన్‌‌‌‌ టెన్నిస్ లెజెండ్ రఫెల్ నడాల్ అదిరిపోయే విక్టరీతో రీఎంట్రీ ఇచ్చాడు. బ్రిస్బేన్‌‌‌‌ ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో నడాల్ 7–5, 6–1తో వరుస సెట్లలో మాజీ వరల్డ్‌‌‌‌ నం.3 డోమినిక్‌‌‌‌ థీమ్‌‌‌‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 

022 గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ అయిన 37 ఏండ్ల రఫా గతేడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌లో ఓడిన తర్వాత ఆటకు దూరం అయ్యాడు. దాంతో 672వ ర్యాంక్‌‌‌‌కు పడిపోయాడు. వైల్డ్‌‌‌‌ కార్డ్‌‌‌‌తో బరిలోకి దిగిన రఫా తన జోరు తగ్గలేదని నిరూపించాడు. ఆరు అనవసర తప్పిదాలే చేసిన అతను ఫస్ట్ సెట్‌‌‌‌లో తన సర్వీస్‌‌‌‌లో మూడు పాయింట్లే కోల్పోయాడు. చివరి తొమ్మిది గేమ్స్‌‌‌‌లో ఎనిమిది గెలిచాడు.