లాల్దర్వాజ బోనాలకు స్పెషల్ బస్సులు

లాల్దర్వాజ బోనాలకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు గ్రేటర్​ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపనున్నారు. ఇందుకోసం 100 బస్సులను అందుబాటులో ఉంచారు.

 సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​, కాచిగూడ రైల్వేస్టేషన్​, జేబీఎస్​, జీడిమెట్ల, పటాన్​చెరు, మెహదీపట్నం, ఈసీఐఎల్​క్రాస్​రోడ్స్​, దిల్​సుఖ్​నగర్​, హయత్​నగర్​, కూకట్​పల్లి, రిసాలా బజార్​, చెర్లపల్లి, రాజేంద్రనగర్​, రామ్​నగర్​, ఉప్పల్​, బోరబండ, మిథాని, కేపీహెచ్​బీ కాలనీ, ఓల్డ్​ బోయిన్​పల్లి, మల్కాజిగిరి, బాలాజీనగర్​ నుంచి లాల్​దర్వాజాకు ప్ర్యతేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు 9959226154, 9959226160 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.