యూట్యూబ్ ఛానల్లో మతమార్పిడిపై స్పెషల్ క్లాసులు.. 33 వీడియోలు అప్లోడ్.. 3600 మంది సబ్ స్కైబర్లు

యూట్యూబ్ ఛానల్లో మతమార్పిడిపై స్పెషల్ క్లాసులు..   33 వీడియోలు అప్లోడ్.. 3600 మంది సబ్ స్కైబర్లు

హైదరాబాద్లో ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  హిజ్బ్ ఉత్ తహరీర్ సంస్థకు  చెందిన ఈ టెర్రరిస్టులు యువతను ఆకర్షించేందుకు  కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ఈ టెర్రరిస్టులు విధ్వంసానికి మూడంచెల ప్రణాళిక రూపొందించారని తెలింది. 

 మొదటి దఫాలో మతమార్పిడి, రెండో దఫాలో పూర్తిగా ఇస్లాంను నమ్మేలా స్పెషల్ క్లాస్ లు , ప్రసంగాలు.. మూడో దఫాలో ఆయుధాలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ను యూట్యూబ్ లో  ప్రారంభించారని విచారణలో తేలింది.  ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో 33 వీడియోలు అప్లోడ్ చేశారని, 3600 మంది సబ్ స్కైబర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

 కామన్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిందితులు ..  డార్క్ వెబ్, రాకెట్ చాట్, తీమ్రా యాప్ ల ద్వారా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరిపారు. సలీం నేతృత్వంలోనే టార్గెట్ హైదరాబాద్ షెడ్యూల్ సాగిందని,  భూపాల్ నుండి యాసిర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సలీం  హైదరాబద్ లో ఇంప్లిమెంట్ చేశాడని విచారణలో తేలింది.  

12 మంది భూపాల్,  ఆరుగురు హైదరాబాదీలకు ఉన్న సంబంధాల పైన దర్యాప్తు సంస్థలు  ఆరా తీస్తున్నాయి.  అరెస్ట్ అయిన 17 మందిలో జిమ్ ట్రైనర్, ప్రొఫెసర్, సాప్ట్ వేర్ ఇంజనీర్లు, డెంటిస్ట్ , టీచర్లు, టైలర్ , ఆటో డ్రైవర్లు, రోజు వారి కూలీలు ఉన్నారు.