దసరాకు 28 స్పెషల్ ట్రైన్స్‌…

దసరాకు 28 స్పెషల్ ట్రైన్స్‌…

హైదరాబాద్‌, వెలుగు: దసరా పండగ నేపథ్యంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్ 2 సర్వీసులను నడిపిస్తామని తెలిపారు. ఈ రైల్‌ సికింద్రాబాద్‌ నుంచి అక్టోబర్‌‌ 1న రాత్రి 8:45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం కాకినాడ చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్ 2న కాకినాడలో రాత్రి 8 గంటలకు బయల్దేరుతుంది. మరో రైలు అక్టోబర్‌‌ 4, 25 వ తేదీల్లో రాత్రి 7:45 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. అక్టోబర్‌‌ 7, 10వ తేదీల్లో రాత్రి 7:25 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌కు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌‌ 8, 26వ తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్‌ నుంచి  సికింద్రాబాద్‌కు బయల్దేరుతాయి. మరో రైలు అక్టోబర్‌‌ 9న కాకినాడ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి నాడు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

ప్రత్యేక్య రైళ్లు ఇవే..
సర్వీస్‌ నంబర్ 07256: అక్టోబర్ ఒకటిన రాత్రి 7:45 గంటలకు సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్‌ బయల్దేరుతుంది.
సర్వీస్‌ నంబర్‌‌ 07255: అక్టోబర్‌‌ 2న సాయంత్రం 6:00 గంటలకు నర్సాపూర్‌‌ నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరుతుంది.
సర్వీస్‌ నంబర్‌‌ 07145: అక్టోబర్ 5న రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి నాగర్‌‌సోల్‌కు బయల్దేరుతుంది.
సర్వీస్‌ నంబర్‌ 07063: అక్టోబర్‌‌ 6, 7, 9న మధ్యాహ్నం 3 గంటలకు నాగర్‌‌సోల్‌ నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరుతుంది.
సర్వీస్‌ నంబర్‌‌ 07064: అక్టోబర్‌‌ 6, 8న రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి నాగర్‌‌సోల్‌కు బయల్దేరుతుంది
సర్వీస్‌ నంబర్‌‌ 06043: అక్టోబర్‌‌ 2, 9, 16, 30న సాయంత్రం 4 గంటలకు విల్లుపురం నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరుతుంది.
సర్వీస్‌ నంబర్‌‌ 06044: అక్టోబర్‌‌ 3,10, 17, 24, 31న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి విల్లుపురం బయల్దేరుతుంది