హనుమకొండ/ గ్రేటర్ వరంగల్, వెలుగు: జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, గౌరవెల్లి, గ్రీన్ ఫీల్డ్ హైవేలకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను స్పీడప్ చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆఫీసర్లను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లో వివిధ శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ ఏఐ అధికారులు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా పరిధిలో 163జీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవెల్లి, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ అంశాలపై ఆరా తీశారు. అనంతరం హెచ్ఐవీ నియంత్రణపై వైద్యాధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించి హెచ్ఐవీనియంత్రణకు కృషి చేయాలని చెప్పారు.
