గల్లీలోకి దూసుకొచ్చిన కారు.. ఢీకొట్టడంతో మరో కారు ధ్వంసం

గల్లీలోకి  దూసుకొచ్చిన కారు.. ఢీకొట్టడంతో మరో కారు ధ్వంసం

మల్కాజిగిరి, వెలుగు: చిన్నపాటి గల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇంటి ముందు ఉన్న కారును వేగంగా ఢీకొట్టడంతో ఆ కారు బోల్తా పడి డ్యామేజ్​ అయింది. ఈ ఘటన నేరేడ్​మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ దీన్ దయాల్ నగర్‌‌లో జరిగింది. శనివారం ఫణి రాజ్ కుమార్ ఇంటి ముందు కారు పార్క్​ చేశాడు.

అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎస్.వనజలక్ష్మి అనే డాక్టర్  వేగంగా కారు డ్రైవ్​ చేస్తూ.. ఫణి  రాజ్​కుమార్​ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి కొంతవరకు డ్యామేజ్​ అయింది. అంతేగాకుండా సమీపంలోని ఇంటి మీదికి కారు దూసుకుపోయిందని స్థానికులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సందీప్ కుమార్ తెలిపారు.