
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఫోన్‌ను సైబర్ స్కామర్స్ హ్యాక్ చేశారు. తనకు వచ్చిన ఏపీకే ఫైల్ అనుకోకుండా ఇన్స్టాల్ కావడంతో ఫోన్‌ను స్కామర్స్ యాక్సెస్‌లోకి తీసుకున్నారని గురువారం ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్లోని కాంటాక్ట్స్‌ను క్లోజ్ చేసి, ఆయన పేరిట మెసేజ్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన నంబర్ నుంచి వచ్చే ఏ మెసేజ్‌కు స్పందించవద్దని శివసేన రెడ్డి ప్రజలను కోరారు.