హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ ఫర్ ఆల్(ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాద్‌లో ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన బాయ్స్ అండర్-12 లాంగ్‌జంప్ ఈవెంట్‌లో హర్వీశ్ శ్రీ గోల్డ్ మెడల్ నెగ్గాడు. అండర్-18 షాట్‌పుట్‌లో ఒమర్ అలీ బంగారు పతకం గెలిచాడు.
గర్ల్స్ అండర్-12 లాంగ్‌జంప్‌లో శ్రీసాయి అనన్య స్వర్ణం ఖాతాలో వేసుకుంది. ఈనెల 28 వరకు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 22 ఆటల్లో 920 స్కూల్స్ నుంచి 23 వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. గచ్చిబౌలితో పాటు యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నాయి.