కాజీపేట, వెలుగు : స్ప్రింగ్ స్ప్రీ- 2026 వేడుకలకు వరంగల్ నిట్ రెడీ అయింది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే వేడుకల్లో సంగీతం, సినిమా, సంస్కృతి, టెక్నాలజీ తదితర అంశాలపై స్టూడెంట్లు 40కి పైగా ఈవెంట్లను ప్రదర్శించనున్నారు.
స్ర్పింగ్ స్ర్పీ వేడుకల్లో భాగంగా బుధవారం కర్టైన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు విద్యార్థుల సృజనాత్మకత, సాంస్కృతిక ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ కిరణ్‌కుమార్, ఎస్ఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ హరిప్రసాద్‌రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రాజామోహన్ పాల్గొన్నారు.
